చాలా గ్యాప్ తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో కింగ్ నాగార్జున నటించడం, ఈ చిత్రం సూపర్‌హిట్ అయి సంక్రాంతి సినిమాల్లో భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున చేసిన బంగార్రాజు క్యారెక్టర్ అందర్నీ ఆకట్టుకుంది. నాగార్జున ఈ క్యారెక్టర్‌పై చాలా లవ్ పెంచుకున్నాడట. అందుకే ‘బంగార్రాజు’ టైటిల్‌ని రిజిష్టర్ చేయించుకున్నాడు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో త్వరలోనే ఈ టైటిల్‌తో ఓ సినిమా రాబోతోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నాగార్జున నటిస్తాడా? లేక నాగచైతన్య, అఖిల్‌లకు అవకాశం ఇస్తాడా అనేది తెలియాల్సి వుంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్‌కృష్ణ డైరెక్షన్లో నాగార్జున ఓ సినిమా నిర్మించనున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ‘బంగార్రాజు’ టైటిల్‌ని రిజిష్టర్ చేయించడంతో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నెక్స్ట్ సినిమా ఇదే అవుతుందని తెలుస్తోంది.