నంది అవార్డుల వల్ల జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అదిప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. ఇవాంక రాక వల్ల.. నంది ప్రస్తావన పక్క దారి పట్టి.. అందరి కళ్లూ మెట్రో రైలుపైనా, ఇవాంక పర్యటనపైనా పడ్డాయి. క్రమంగా నంది వివాదం మర్చిపోయారు. ఇప్పుడు నాగార్జున వల్ల నంది మళ్లీ బయటకువచ్చింది. ‘హలో’ ట్రైలర్లో ‘టు విచ్ యూ అవార్డెడ్ యువర్ హార్ట్స్’ అంటూ పరోక్షంగా ‘మనంకి నంది రాలేదన్న’ బాధ వెల్లగక్కాడు నాగ్. ట్రైలర్లో చూపించిన ఆ కొటేషన్… నంది రాలేదన్న బాధతోనేనా? అని నాగ్ని అడిగితే తెలివిగా సమాధానం చెప్పాడు. ”మనంని తెలుగు ప్రేక్షకులంతా గుండెల్లో పెట్టుకున్నారు. అంతకుమించి అవార్డులేం అక్కర్లెద్దు” అంటూ సున్నితంగా.. తన కోపాన్ని వెళ్లగక్కాడు. ‘మనం’కి జరిగిన అన్యాయానికి నాగ్ కూడా బాధ పడ్డాడన్నది నిజం. అందుకే… ‘మనం’ని గుర్తు చేస్తూ ‘హలో’ టీజర్లో అలాంటి కొటేషన్ సెట్ చేశాడు. అది ఎవరికి చేరాలో వాళ్లకే చేరింది. మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అదే ప్రశ్నగా మారింది. దానికి నాగ్ ఆల్రెడీ రెడీ చేసుకున్న సమాధానం ఇచ్చేశాడు. ‘అవార్డులు అక్కర్లెద్దు’ అనేదానికి అర్థం అదు!! నిజానికి నాగ్ చాలా ఓపెన్ మైండెడ్. ఏ విషయాన్నీ లోతుగా తీసుకోడు. అలాంటిది… నంది విషయంలో ఇలాంటి కామెంట్ చేశాడంటే, ఎంత హర్ట్ అయ్యాడో మరి!!