సినిమా రివ్యూలది ఎప్పుడూ కీలక పాత్ర. ఒక ప్రోడక్ట్ కొనుగోలు చేసేముందు చాలా రివ్యూలు చూస్తాం. రేటింగ్స్ చూస్తాం. అదే సినిమాకి కూడా వర్తిస్తుంది. కానీ చాలా మంది దిన్ని అంగీకరించరు. విమర్శకులకు రివ్యూలకు సంబంధం లేకుండా ఈ సినిమా ఆడుతుందని స్టేట్మెంట్లు ఇస్తారు. అయితే నాగార్జున మాత్రం రివ్యూలదే కీలక పాత్రని అభిప్రాయపడ్డారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన రివ్యూల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
”అప్పట్లో రివ్యూలు పేపర్లలో వారానికి వచ్చేవి. అప్పటికి సినిమా ఉందో లేదో కూడా తెలిసేది కాదు. రివ్యూలను ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మాత్రం సినిమా టాక్‌లో రివ్యూలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నేను కూడా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడాలంటే ముందు ఐఎండీబీ రేటింగ్స్ చూస్తాను. కనీసం వెయ్యి రివ్యూలు, 7 రేటింగ్ ఉంటేనే సినిమా, సిరీస్ చూస్తాను. లేదంటే సమయం వృధా” అని రివ్యూల ప్రాధన్యత గురించి స్పష్టం చేశారు నాగార్జున.