కరోనా కారణంగా షూటింగులన్నీ బంద్ అయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పరిమితులతో షూటింగులకు అనుమతి ఇచ్చినా – చిన్నా చితకా సినిమాలు మొదలయ్యాయి తప్ప, పెద్ద హీరోలు ధైర్యం చేయలేదు. అయితే అగ్ర కథానాయకుల నుంచి ఇప్పుడు తొలి అడుగు పడింది. నాగార్జున రూపంలో.
నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `వైల్డ్ డాగ్`. దియామీర్జా, సయామీ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాల్మన్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్రత్యేక జాగ్రత్తలు, కేంద్ర ప్రభుత్వ పరిమితులకు లోబడి షూటింగ్ నిర్వహించారు. నాగార్జునపై ఆఫీసు సెటప్‌లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. నాగ్ తొలి అడుగు వేశాడు కాబట్టి. ఇక పెద్ద స్టార్లంతా ఆ బాటలో నడిచే అవకాశాలున్నాయి. చిరు, బాలయ్య, వెంకీ సినిమాలు కొన్ని సెట్స్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఈనెలలోనే బాలయ్య – బోయపాటి సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. వెంకీ, చిరులు ఎప్పుడు మొదలెడతారో?