రాంగోపాల్ వర్మ – నాగార్జున కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ప్రస్తుతం ముంబైలో యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దించాడు వర్మ. ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటించలేదు. అయితే వర్మ ‘గన్’ అనే టైటిల్‌పై ఎక్కువ మక్కువ చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్‌కి సంబంధించిన లోగోలు కూడా డిజైన్ చేసి ఉంచాడు వర్మ. టైటిల్ వింటున్నప్పుడు పెద్దగా ఎక్కలేదు గానీ లోగోతో సహా చూసినప్పుడు నాగ్‌కి బాగా నచ్చిందట. దాంతో నాగార్జున కూడా ‘గన్’కే ఓటేసినట్టు తెలుస్తోంది. ‘శపథం’ అనే మరో టైటిల్ అనుకుంటున్నా… అదేదో పాత సినిమాలా కనిపిస్తోందని నాగ్ ఆ టైటిల్‌ని తిరస్కరించాడని సమాచారం. వారం, పది రోజుల్లో టైటిల్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.