నాగార్జునకు తెలివితేటలు ఎక్కువే. నిర్మాతగా ఉంటున్నప్పుడు ఇంకాస్త చురుగ్గా వ్యవహరిస్తుంటారు. తన తనయుడి చిత్రమైనా సరే – ప్రేమ కొద్దీ భారీగా ఖర్చు పెట్టేయరు. మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొనే ఖర్చు ఉంటుంది. ఆఖరికి అది తన సొంత సినిమా అయినా సరే. ఇప్పుడు ఆ తెలివితేటలు మరోసారి బయటపడ్డాయి.
వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా సినిమా అనగానే అది ‘అన్నపూర్ణ స్టూడియో ప్రొడక్ట్’ అని అంతా ఫిక్సయిపోయారు. కాకపోతే ఇప్పుడు అది వర్మ `కంపెనీ`లో తెరకెక్కుతోంది. నాగ్‌కి కథ చెప్పి ఒప్పిస్తే – నిర్మాతని చూసుకోవాల్సిన అవసరం ఉండదని వర్మ భావించాడు. కాకపోతే నాగ్ మాత్రం ‘నిర్మాణ బాధ్యతల్ని నేను చూసుకోలేను. నాకు పారితోషికం చాలు.. ఓ నిర్మాతనీ చూసుకో’ అని చెప్పేసరికి – వర్మకే షాక్ తగిలినట్టైంది. అందుకే ఈ సినిమాని తన నిర్మాణ సంస్థలో తెరకెక్కించడానికి ఫిక్సయ్యాడు. అయితే ఈ సినిమా `కంపెనీ` పేరుతో తెరకెక్కుతున్నా – తెర వెనుక మరో నిర్మాత ఉన్నాడని తెలుస్తోంది. ఆ విధంగా వర్మ కూడా సేఫ్ గేమ్ మొదలెట్టేశాడన్నమాట.