నాగచైతన్య, సమంతలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్నది ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ‘నేను పెళ్లికి రెడీ. ఓ హీరోని పెళ్లి చేసుకోబోతున్నా’ అని సమంత చెప్పడం, ఆ తరవాత సమంత, చైతూ కలసి చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఫొటోలు మీడియాలో హల్ చల్ చేయడం, నాగార్జున కూడా ‘త్వరలోనే చైతూ పెళ్లి చేసుకోబోతున్నాడు, పెళ్లి కూతుర్ని కూడా వెదుక్కొన్నాడు’ అని తేల్చేయడం ఇలాంటి సీన్లన్నీ కళ్ల ముందు చకచక నడిచి వెళ్లిపోయాయి. సమంతని పెళ్లి చేసుకోవడం నాగార్జునకు ఇష్టం లేదని, అందుకే చైతూ – నాగ్ ఎడమొహం పెడమొహంగా ఉన్నారని ఓ వర్గం చెబుతోంది. అయితే… ఇటీవలే నాగార్జున పర్సనల్గా సమంతని కలుసుకొన్నార్ట. మరి ఇద్దరి మధ్య చర్చ ఏం జరిగిందో తెదుగానీ.. పెళ్లి గురించే ఈ భేటీ సాగిందని తెలుస్తోంది.
పెళ్లి ఎప్పుడు చేయాలి, ఎవరిని పిలవాలి? అనే విషయంలో సమంతతో నాగ్ మాట్లాడారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మనం సినిమా తరవాత ఒకట్రెండు సందర్భాల్లో నాగ్, సమంతలు కలుసుకొన్నారు. అయితే అప్పట్లో ఈ ప్రేమ వ్యవహారం బయటకు పొక్కలేదు. పెళ్లి వరకూ వెళ్లిందీ లేదు. అందుకే.. ఈ కలయిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాగ్ సన్నిహితులు మాత్రం ”సమంతని నాగ్ కలుసుకోవడమా? అలాంటిదేం జరగలేదే..” అని చెబుతున్నారు. అయితే ఈ యేడాది చివర్లో చైతూ పెళ్లి జరగడం ఖాయమన్నది వాళ్ల మాట. మరి.. ఇందులో నిజమెంతో నాగ్, సమంతలకే తెలియాలి.