అక్కినేని అభిమానులు నాగార్జునను ముద్దుగా పిలుచుకొనే పేర్లలో ‘మన్మథుడు’ ఒకటి. ఆయన అందానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఇచ్చిన బిరుదు అది. నాగార్జున ప్రస్తావన వస్తే… తప్పకుండా అందం గురించి ప్రస్తావన వస్తుంది. ఐదు పదుల వయసులోనూ ఎంతో అందంగా వున్నారని ప్రశంసిస్తుంటారు. ఈ మాటలు నాగార్జునకు అంతగా రుచించడం లేదనుకుంట! అందులో పొగడ్త కంటే వయసు పైబడుతోందనే పలుకు ఆయనకు పంటికింద రాయిలా తగులుతున్నట్టుంది. అందుకని, వయసు ప్రస్తావన తీసుకురావొద్దని ‘ఆఫీసర్’ సినీ వేడుకలో విజ్ఞప్తి చేశారు.
“ఈ మధ ‘ఇంత వయసు వచ్చినా యంగ్‌గా కనపడుతున్నాను’ అని అంటున్నారంతా. ఈ మాట ఎక్కువగా వింటున్నా. ఏజ్ (వయసు) గురించి మానేయండయ్యా బాబూ! ఐయామ్ స్టిల్ యంగ్. ఇంతకు ముందే చైతన్య నన్ను బ్రదర్ అన్నాడు కదా! గుర్తు పెట్టుకోండి.. వయసు గురించి మానేయండి” అని సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు నాగార్జున. వయసు అనేది దాస్తే పోయేదా ఏంటి?! అందరికీ నాగార్జున ఏజ్ ఎంతో తెలుసు కదా. ‘ఆఫీసర్’ సినిమాకి వర్క్ చేసినవాళ్లలో చాలామంది యంగ్ పీపుల్ వున్నార్ట. వాళ్ళతో వర్క్ చేయడం కొత్తగా, వయసు పెరుగుతుందనే మాటలు వింటుండటంతో ఛేంజోవర్గా వుందని నాగార్జున తెలిపారు.