కింగ్ నాగార్జున కుర్ర హీరోలకు పోటీగా తన సినిమాలను రిలీజ్ చేస్తుండటం విశేషం. పోటీ పడటమే కాదు రేసులో ముందుంటున్నాడు ఈ మన్మధుడు. సంక్రాంతి రేసులో సోగ్గాడే చిన్ని నాయనా అంటూ వచ్చి ఏకంగా 50 కోట్ల వసూళ్లను సాధించిన నాగ్ మరో వారంలో ఊపిరి సినిమాతో రాబోతున్నాడు. నాగార్జున, కార్తి మల్టీస్టారర్ గా నటించిన ఈ సినిమాలో కత్తి మీద సాములాంటి పాత్రలో నటించారు నాగార్జున. సినిమా మొత్తం కేవలం కుర్చిలోనే ఉండేలా ఉన్న తన పాత్రలో మరోసారి తన అభినయంతో అదరగొట్టబోతున్నాడు నాగ్.
ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓం నమో వెంకటేశ సినిమా చేస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా త్రివిక్రం అ..ఆ తర్వాత చేయబోతున్న బన్ని సినిమాలో నాగ్ కూడా నటిస్తున్నాడంటూ హడావిడి చేస్తున్నారు. త్రివిక్రమ్ మల్టీస్టారర్ షురూ చేసేశాడని టాక్ వచ్చింది. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చారు నాగార్జున.
తాను రాఘవేంద్ర రావు సినిమా.. ఆ తర్వాత బంగార్రాజు సినిమాలు మాత్రమే చేస్తున్నానని.. ఇక మిగతా ఏ సినిమా గురించి తనతో చర్చలు జరుపలేదని అన్నారు. మార్చ్ 25న రిలీజ్ అవనున్న ఊపిరి సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నారు నాగార్జున. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని.. మనసుకి హత్తుకునే సినిమాగా ఇది తనకు చాలా ప్రత్యేకం అంటూ ఊరిస్తున్నాడు నాగార్జున.