సినిమా టికెట్ రేట్లు, ఇతరత్రా వ్యవహారాలపై ఇటీవల చిరంజీవి – జగన్ ల మధ్య భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో సినిమా పరిశ్రమకు చెందినచాలా విషయాలు చర్చకు వచ్చాయని తెలిసింది.కాకపోతే.. ఎవరేం మాట్లాడుకున్నారో, జగన్ ఎలాంటి హామీలిచ్చారో మాత్రం బయటకురాలేదు. చిరు సైతం `చిత్రసీమకుత్వరలో మంచి రోజులు వస్తాయి` అనే ఆశాభావం వ్యక్తం చేశారు తప్ప, డిటైల్స్ లోకి వెళ్లలేదు. చిరు మీటింగ్ అయిపోయాక.. దానిపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. చిరుని జగన్ ఆహ్వానించలేదని, చిరునే అప్పాయింట్ మెంట్ అడిగి వెళ్లారని, ఇద్దరి మధ్యా రాజకీయపరమైన ఒప్పందాలు జరిగాయని ఏవోవే టాక్స్ బయటకువచ్చాయి. ఇదంతా ఎందుకంటే… రాజమండ్రిలో `బంగార్రాజు` సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా స్టేజీపై నాగ్ మాట్లాడుతూ.. జగన్ – చిరుల భేటీ ని గురించి ప్రస్తావించారు. ”మొన్ననే చిరంజీవిగారితో మాట్లాడాను. ‘జగన్ తో మీటింగ్ అయ్యింది కదా.. ఏం మాట్లాడుకున్నారు’ అని అడిగాను.. ‘చిత్రసీమకు అంతా మంచే జరుగుతుంది’ అన్నారు. ఈ సందర్భంగా జగన్ కి థ్యాంక్స్” అన్నారు నాగ్. దాన్ని బట్టి… త్వరలోనే చిత్రసీమ కష్టాలు తీరిపోతాయని అటు చిరుతో పాటు ఇటు నాగ్ కూడా బలంగానే నమ్ముతున్నారనిపిస్తోంది. నిజానికి ఈ మీటింగ్ కి నాగ్ కూడా వెళ్లాల్సిందట. కానీ… `బంగార్రాజు` ప్రమోషన్ల కోసం నాగ్ ఆగిపోవాల్సివచ్చింది. ఏపీలో ‘బంగార్రాజు’ కోసమే నైట్ కర్ఫ్యూ విధించాలన్న ఆలోచనని జగన్ వాయిదా వేశారని, సంక్రాంతి అయిపోయిన తరవాతే.. నైట్ కర్ఫ్యూ నిబంధనని అమలులోకి తెచ్చారని ఫిల్మ్‌నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఆ లెక్కన చూసినా… జగన్ కి నాగ్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.