ఏయన్నార్… అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నాగార్జున వారసుడిగా నాగచైతన్య, అఖిల్ వచ్చారు. ఆ లెక్కన చైతూ ఏయన్నార్ వారసుడే. కథానాయకుడిగా మాత్రమే కాదు… మరో విషయంలోనూ ఏయన్నార్ వారసత్వాన్ని చైతూ తీసుకున్నాడని నాగార్జున చెప్పారు. అదేంటంటే… ఏయన్నార్ సినిమాల్లో మహిళల క్యారెక్టర్లు బలంగా వుండేవి. ఇప్పుడు చైతూ అదే విధంగా స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ వున్న సినిమా చేశాడని ‘శైలజారెడ్డి అల్లుడు’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో నాగార్జున చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రేమకథా చిత్రాలైనా… ఎంటర్టైన్మెంట్ చిత్రాలైనా… ఒక స్ట్రాంగ్ లేడీ క్యారెక్టర్ ఉన్న సినిమాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ చేశారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని చైతన్య తీసుకున్నాడు. అందరూ చైతన్య సాఫ్ట్ అనుకుంటారు. చైతూలో చిలిపితనం కూడా ఉంది. నేను కొంచెం సినిమా చూశా. మారుతిగారు చిలిపితనాన్ని చక్కగా వాడుకున్నారు’’ అన్నారు. తన పుట్టినరోజు నాడు అన్నయ్య అని ఆప్యాయంగా పిలుచుకునే నందమూరి హరికృష్ణ మరణించడం బాధగా వుందని తెలిపారు.