సోగ్గాడే చిన్ని నాయనతో సూపర్ హిట్టు కొట్టి తెలుగు పరిశ్రమని ఆకర్షించాడు కల్యాణ్ కృష్ణ. రారండోయ్ వేడుక చూద్దాం… హిట్ సినిమా అని చెప్పలేం గానీ, పెద్దగా చెడగొట్టలేదు. అయితే… ‘నేల టికెట్టు’తో మాత్రం పాతాళానికి పడిపోయాడు కల్యాణ్ కృష్ణ. ఈ సినిమాని, అందులోని సన్నివేశాల్నీ తీర్చిదిద్దిన విధానం చూస్తే.. ‘సోగ్గాడే తీసింది ఇతగాడేనా’ అనే అనుమానాలు రేగడం ఖాయం. కెరీర్ నిలబడడానికి ఓ పెద్ద హిట్టు చాలు, తిరగబడిపోవడానికి ఇదిగో.. ఇలాంటి సినిమా ఒక్కటి చాలు. నేల టికెట్టు రిజల్ట్‌తో కల్యాణ్ కృష్ణ పరిస్థితి క్లిష్టంగా మారబోతోంది. అన్నీ అనుకన్నట్టు జరిగితే.. ‘బంగార్రాజు’ పట్టాలెక్కాల్సింది. నాగార్జున కూడా ఈ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ‘నేల టికెట్టు’ రిజల్ట్‌తో ఈ సినిమా ఇప్పుడు ఇరకాటంలో పడింది. నాగ్ అసలే ఇప్పుడు ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ఒకప్పటిలా.. సాహసించి నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఆయనా సేఫ్ గేమ్ కి అలవాటు పడ్డాడు. ఈ దశలో కల్యాణ్ కృష్ణకు పిలిచి అవకాశం ఇస్తాడనుకోవడం అత్యాసే అవుతుంది. కాబట్టి.. మరో కథ రాసుకుని, మరో హీరోని ఒప్పించుకోవాల్సిందే. కాకపోతే.. నేల టికెట్టు చూస్తే.. హీరోలు, నిర్మాతలు ముందుకొస్తారా అనేదే డౌటు.