నాగార్జున, కార్తి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఊపిరి. రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా గురించి నాగార్జున కాస్త కంగారు పడ్డాడట. అంతేకాదు తనకు అసలు నటన రాదేమో అన్న భావన కూడా కలిగేలా చేసిందట ఈ సినిమా. అసలు నాగ్ ఎందుకు అంత ఇబ్బంది పడ్డాడు అంటే ఊపిరి సినిమాలో తనది మొత్తం వీల్ చైర్ లో నటించే పాత్ర. అయితే ఇలాంటి సినిమాలు చేసేప్పుడే తమ అనుభవం తమని ప్రశ్నిస్తుంది. సన్నివేశం ఏదైనా కేవలం ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో మాత్రమే ప్రేక్షకులను మెప్పించాలి. మరి అలాంటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది.
సీన్ షూట్ చేస్తున్నప్పుడు కాళ్లు చేతులు ఏమన్నా కదులుతున్నాయా అని ఇద్దరు అసిస్టెంట్ లను పెట్టడం జరిగిందట. ప్రతి సన్నివేశానికి దాదాపు 20 టేకులు తీసుకున్నారని నాగార్జున వెళ్లడించారు. అంత కష్టపడి ఇష్టపడి చేసినా సినిమా అవుట్ పుట్ చూసి చాలా సాటిస్ఫై అయ్యారట నాగ్.. అందుకే సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని నమ్మకంగా చెబుతున్నాడు.
నాగ్, కార్తిలతో పాటుగా తమన్నా కూడా సినిమాలో నటించగా స్వీటి అనుష్క, శ్రీయా శరణ్ కూడా స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం చేసిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో తెలుసుకోవాలంటే మరో 24 గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది.