కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా ఇంకా ప్యాచ్ వర్క్ జరుగుతూ వస్తుంది. ఈ సినిమాకు కళ్యాన్ కృష్ణ అనే కొత్త దర్శకుడు డైరక్టర్ గా పరిచయమవుతున్నాడు. కథ దర్శకత్వం తాను అందిస్తుంటే మాటలను మాత్రం సాయి మాధవ్ చేత రాయిస్తున్నాడు నాగార్జున. తన సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమా అవుట్ పుట్ మీద అసంతృప్తిగా ఉన్నాడట మన కింగ్. ఆల్రెడీ షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన ఈ సినిమాలో కొన్ని సీన్లు రీషూట్ చేస్తే మంచిందని సలహా ఇచ్చాడట మాటల రచయిత సాయి మాధవ్.
అందుకే మళ్లీ షూట్ షురూ చేస్తున్నారు చిత్ర యూనిట్. మొదటి సినిమానే నాగార్జునతో తీసే సబ్జెక్ట్ తెచ్చిన కళ్యాన్ కృష్ణ అభినందనీయుడే అయినా స్టార్ హీరో సినిమాను డీల్ చేసే విధానంలో పాటించాలిస్న జాగ్రత్తలు మీద పట్టు సాధించలేకపోయాడట. అందుకే ఈ సినిమాలో కొన్ని సీన్లు మళ్లీ రీ షూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే ఫైనల్ అవుట్ పుట్ మీద మాత్రం నాగార్జున చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. రీసెంట్ గా నాగ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ అక్కినేని ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. తండ్రి కొడుకులుగా నాగార్జున చేస్తున్న సోగ్గాడే చిన్ని నాయనాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటిలు హీరోయిన్లుగా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను నాగ్ కి బాగా అచ్చొచ్చిన డిశెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.