సినీనటి, నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ఫైర్‌బ్రాండ్ రాజకీయ నాయకురాలు రోజా బుధవారం నాడు ఓ అద్భుతమైన వాక్యం సెలవిచ్చారు. శాసనసభలో తన ప్రవర్తన గురించి తానేమీ విచారించడం లేదని రోజా అన్నారు. నగరి నియోజకవర్గ సమస్యలకు సంబంధించి.. చెన్నై రైల్వే అధికార్లకు నివేదించడానికి వచ్చిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తన ప్రవర్తన గురించి తనలో విచారం లేదని’ వెల్లడించడం చాలా ఆసక్తికరం. ఇప్పుడు అందరూ భావిస్తున్నదేంటంటే.. అసలు విచారించే తత్వం ఉన్న మహిళే అయితే గనుక.. రోజా సభలో అలా ప్రవర్తించి ఉండేదే కాదు అని అంటూన్నారు.
రోజా ఎపిసోడ్ ముగిసిపోయి చాలారోజులు గడిచాయి. అయితే వాస్తవంగా అసలు రోజా ఏం మాట్లాడింది. ఎవరిని ఏం తిట్టింది? అని ఆరాలు తీసినప్పుడు ఆమె సభలో ప్రవర్తన గురించి చాలా దిమ్మతిరిగే వాస్తవాలు తెలిసివచ్చాయి.
రోజా సభలో చాలా ఆకతాయిగా.. ప్రవర్తించడం అనేది ఆరోజు ఒక్కరోజే కాదని.. నిత్యం ఇదే తరహాలో చేస్తుంటుందని పలువురు అనుకుంటున్నారు. ప్రచారం జరుగుతోంది. మంత్రులు మాట్లాడడానికి ఎవరు లేచినా కూడా.. తన బెంచీల్లో కూర్చుని వెటకారపు సెటైర్ డైలాగులు వేస్తూ ఉండడం ఆమెకు అలవాటుట! ఫరెగ్జాంపుల్ ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి లేస్తే చాలు.. ‘తాడిచెట్టులా పెరిగావ్.. నువ్వేం మాట్లాడతావ్లే కూచో’ అంటూ జోకులేస్తుందిట. సభలో ఏమీ అనలేని పరిస్థితి.. మంత్రులే పట్టనట్టుగా సైలెంట్‌గా ఉండడం జరుగుతూ ఉంటుందిట.
కాల్ మనీ రభస జరిగిన రోజున చంద్రబాబును ‘కామ సీఎం’ అనడం అసలు ఆమె ప్రవర్తన గురించి తీవ్రమైన వ్యవహారం కానేకాదని పలువురి అభిప్రాయం. ఆ మాటకొస్తే.. మహిళా మంత్రి వ్యక్తిగత జీవితాన్ని రచ్చకీడ్చిన వైనం కూడా కొంతమేరకే అభ్యంతరకరం అని కొందరు అంటున్నారు. నిజానికి ఓ తెదేపా సీనియర్ నాయకుడిని ఉద్దేశించి.. చాలా నీచమైన బూతులను రోజా తిట్టిందని.. ఆయన కాస్త మృదువుగా స్పందించబోతే.. అంతకంటె నీచమైన బూతులతోనే మళ్లీ బదులిచ్చిందని.. ఆయనే సిగ్గుపడి సభలోంచి వెళ్లిపోయారని అంటున్నారు. ఇలా నోటికి ఎంత మాటలొస్తే.. అంతలేసి మాటలనడం అలవాటుగా మారిపోయిందని.. తన ప్రవర్తనకు విచారించే సౌహార్దం ఉన్న మహిళే అయితే గనుక.. అసలు సభలో మరీ అలా నీచమైన బూతులు మాట్లాడేలా చేయనే చేయదని పలువురు అనుకుంటున్నారు. ఈ పుకార్లు నిజమే అయితే గనుక.. రోజా.. తన ప్రవర్తన గురించి విచారించడం సంగతి తర్వాత.. మన జోలికి రాకుండా ఉంటే చాలునని ఎవరైనా అనుకుంటారు మరి!