హీరోయిన్ నమిత వివాహం తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో ఘనంగా జరిగింది. తమిళ దర్శక నిర్మాత వీరేంద్ర చౌదరిని నమిత ప్రేమ వివాహమాడింది. అంతకుముందు చెన్నైలోని నమిత నివాసంలో మెహందీ కార్యక్రమం జరిగింది. వీరేంద్ర చౌదరి-నమిత రెండేళ్లుగా ప్రేమలో వున్నారు. ఇటివలే ప్రేమ విషయం తెలియజేయడం, దానికి ఇరు కుటుంబ పెద్దలు ఒప్పుకోవడం, వివాహం జరగడం చకచక జరిగిపోయాయి.
తిరుపతిలోని ఇస్కాన్ ఆలయంలో జరిగిన వీరి వివాహానికి రాధిక, శరత్‌కుమార్ దంపతులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ‘సొంతం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమమైన నమిత..‘ఒక రాజు ఒక రాణి’, ‘జెమిని’, ‘బిల్లా’ తదితర చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తానని చెబుతుంది నమిత.