ఈమధ్య ఏ సినిమాకీ రానంత నెగిటీవ్ టాక్ బ్రహ్మోత్సవంకి చుట్టుకొంది. ఆ ప్రభావం సినిమా వసూళ్లపై విపరీతంగా పడింది. ఎలాగున్నా చూద్దాం అనుకొన్నవాళ్లు సైతం డ్రాపయిపోయారు. ఓ ఇంగ్లీషు పత్రిక… బ్రహ్మోత్సవంపై ఇచ్చిన నెగిటీవ్ పబ్లిసిటీ అందరికీ షాకిచ్చింది. ఇంత నెగిటీవ్ టాక్ వస్తుందని చిత్రబృందం అస్సలు ఊహించలేకపోయింది. ఇకనైనా ఈ విష ప్రచారం ఆపాలని నమ్రత నిర్ణయించుకొందని, అందుకే రంగంలోకి దిగి మీడియా బాస్‌లతో మాట్లాడుతోందని టాక్. నిజానికి బ్రహ్మోత్సవం ప్రచార బాధ్యతను నమ్రతనే తీసుకొంది. విడుదలకు ముందు ఈసినిమాకి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. అలా హైప్ రావడానికి నమ్రత తీసుకొన్న జాగ్రత్తలు, వేసిన వ్యూహాలే కీలక పాత్ర పోషించాయి.
అయితే సినిమా ఫలితం దారుణంగా బెడసి కొట్టడంతో నెగిటీవ్ టాక్ విజృంభించింది. తేరుకొనేలోగా ఈ సినిమాపై నెగిటీవ్ టాక్ అంతటా పాకేసింది. రోజురోజుకీ.. అది పెరుగుతూ పోవడం పట్ల మహేష్ బాబు కూడా అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. సినిమా పోతే పోయింది.. కనీసం వెబ్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వస్తున్న ఈ టాక్ని ఆపాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే మళ్లీ నమ్రత రంగంలోకి దిగి.. ఈ ప్రచారం ఆపడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా వచ్చింది. ఫ్లాప్ అయ్యింది.. ఇప్పుడు ఎంత చేసినా ఏం లాభం?? పోయిన పరువు తిరిగి రాదు కదా?