నందమూరి బాలకృష్ణ మళ్లీ రెచ్చిపోయాడు. ఒక ఓటరు సెల్ ఫోన్ లాక్కున్నాడు. ఓటరును పరిగెత్తించి మరీ తన్నాడు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రాన్ని నివ్వెరపరుస్తోంది. ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లాకు వచ్చిన బాలకృష్ణ మీద, ఆ సభలో పాల్గొన్న ప్రజలలో ఒక వ్యక్తి పొరపాటున పడ్డాడు. ఇంతే, సదరు నట సింహానికి చిర్రెత్తుకొచ్చింది. ఆ వ్యక్తి మీద విరుచుకుపడ్డాడు, భయకంపితుడైన ఆ వ్యక్తి పరిగెత్త పోతే, బాలకృష్ణ కిందకు దిగి పరిగెత్తి, అతన్ని తరిమి, పట్టుకుని ఒంగోపెట్టి, మోచేతి తో, మోకాలి తో, పిచ్చి పట్టిన వాడిలా అతని మీద దాడి చేశాడు. మరి ఈసారైనా బాలకృష్ణ చేసిన పనికి శిక్ష ఉంటుందా? లేదంటే ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి, మరొక ముఖ్య మంత్రి వియ్యంకుడు కాబట్టి, ఏ శిక్ష పడకుండా హాయిగా మన మధ్య తిరుగుతాడా?
బాలకృష్ణ తీరు చూసిన ప్రజలు నివ్వెర పోతున్నారు. ఎమ్మెల్యేగా ఉండడం మాట పక్కన పెడితే, అసలు ఒక ప్రజాస్వామ్యంలో మిగతా వారితో పాటు కలిసి ఉండడానికి బాలకృష్ణ అర్హుడేనా అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ హిందూపురం ప్రజలు ఈ సారి మళ్ళీ బాలకృష్ణ ని గెలిపిస్తే కనక, బాలకృష్ణకు, హిందూపురానికి కలిపి ఒక ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలని నెటిజన్లు ఆక్రోశంతో కూడిన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
అదే విధంగా మీడియా కూడా గమనించాల్సిన సంగతి ఒకటుంది – బాలకృష్ణ ఇలా ఎవరిమీదైనా దాడి చేసినప్పుడు, అభిమాని మీద దాడి చేశాడంటూ రాయడం సరికాదు. అసలు అక్కడ సభలో పాల్గొన్న వ్యక్తి అభిమానా కాదా అన్నది ఎవరికీ తెలియదు. ఆయన సినిమా ఆడియో ఫంక్షన్ లో అయితే బహుశా అభిమానులు మాత్రమే హాజరు కావచ్చేమో. కానీ ఇది రాజకీయ సభ. అన్ని పార్టీల సభలకు హాజరయ్యే హక్కు అందరూ ప్రజలకు ఉంటుంది. కాబట్టి అలా హాజరైన ప్రజలలో ఎవరినైనా బాలకృష్ణ కొడితే, తంతే, అది అభిమానికి హీరోకు మధ్య జరిగిన అంశం లాగా రాయడం మానివేయాలి. ఒక సామాన్యుని, ఒక ఓటరు ని, ఒక రాజకీయ నాయకుడు, తనను తాను “రేర్ బ్రీడ్” గా భావించే ఒక అహంకారి దాడి చేసినట్లుగా వార్తను తెలపాల్సిన అవసరం ఉంది.