బాలకృష్ణ ఆలోచనా ధోరణి అర్థం చేసుకోవడం చాలా కష్టం. దర్శకుల్ని. కథానాయికల్ని ఆయన ఎంపిక చేసే పద్ధతిని ఎవరూ.. జడ్జ్ చేయలేరు. ప్రాజెక్టులు సెట్ చేసుకోవడంలోనే ఊహించని ట్విస్టులుంటాయి. ఫ్లాప్ దర్శకులందరినీ బాలయ్య పిలిచి మరీ అవకాశాలు ఇస్తుంటాడు. తనతో ఫ్లాప్ తీసినా.. తనకు పట్టింపు ఉండదు. అదే మరోసారి రిపీట్ అవుతోంది.
ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఆ తరవాత.. బి.గోపాల్ తో ఓ ప్రాజెక్టు సెట్ అయ్యింది. ప్రస్తుతం బి.గోపాల్ బాలయ్య కోసం కథ రెడీ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు శ్రీవాస్ కీ బాలయ్య ఛాన్స్ ఇచ్చేశాడు. శ్రీవాస్ ఇది వరకు బాలయ్యను `డిక్టేటర్`గా చూపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర తుస్సుంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో భారీగా ఖర్చు పెట్టిన తీసిన `సాక్ష్యం` కూడా ఫ్లాపే. అయినా సరే, బాలయ్య ఛాన్సిచ్చాడట. కోన వెంకట్ ఈ కథని అందించారని, అది… బాలయ్యకు నచ్చిందని, అందుకే ఈ సినిమా ఫైనల్ చేశారని టాక్. సో.. బి.గోపాల్ సినిమా అవ్వగానే, శ్రీవాస్ ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చు.