అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చిన నందిని రెడ్డి ఆ తర్వాత తీసిన జబదస్థ్ సినిమాతో ఎన్నో అపవాదాలు మూటకట్టుకుంది. ఓ టైంలో నందిని ఇక సినిమాలు చేస్తుందా లేదా అన్న సంక్షోభం కూడా ఉండేది. అయితే తనకు పరిశ్రమ నుండి మంచి సపోర్ట్ ఉన్నా సరే దాన్ని నిలబెట్టుకునే సమయం కోసం ఎదురు చూసి టైం చూసి వచ్చేసింది. కళ్యాణ వైభోగమే అంటూ వచ్చిన ఆమె దర్శకత్వంలోని సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది.
సినిమా చూసిన ప్రతి ఒక్కరు నందిని రెడ్డిని ప్రశంసించకుండా ఉండలేరు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో నాగ శౌర్య, మాళవికా నాయర్ ల నుండి తనకు కావాల్సిన పర్ఫెక్ట్ నటనను తీసుకుంది. సినిమాలో ముఖ్యంగా కథ కథనాలే బలంగా రాసుకుని సినిమలో ఎక్కడ అనవసరమైనవి పెట్టకుండా చేసి హిట్ కొట్టింది. యూత్ కి నచ్చే అంశాలతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమాను ప్రేక్షకుల్లో తెచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. మరి చూస్తుంటే తన టాలెంట్ మీద పడ్డ మచ్చ కోసం నందిని రెడ్డి ఈ సినిమా కసితో తీసిందని సినిమా చూస్తేనే అర్ధమవుతుంది. సో నందిని రెడ్డి కూడా హిట్ ట్రాక్ ఎక్కేసి నట్టే అన్నమాట.