ఆ ద‌ర్శ‌కుడికి నాని మాటిచ్చాడా?!

నాని లైన‌ప్ మామూలుగా ఉండ‌దు. ఓ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే మ‌రో రెండు సినిమాల స్క్రిప్టులు రెడీగా ఉంటాయి. ఇద్ద‌రు ముగ్గురు దర్శ‌కులు క‌థ‌లు వండుతుంటారు. న‌లుగురు నిర్మాతలు అడ్వాన్సులతో రెడీగా ఉంటారు. ఇప్ప‌టికున్న లైన‌ప్ చూసుకొంటే నాని మ‌రో రెండేళ్లు బిజీ. ఇంత హ‌డావుడిలోనూ మ‌రో ద‌ర్శ‌కుడికి నాని మాటిచ్చేశాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. త‌నే దేవా క‌ట్టా.

‘ప్ర‌స్థానం’ సినిమాతో ఇండ‌స్ట్రీ చూపు త‌న వైపు తిప్పుకొన్నాడు దేవాక‌ట్టా. అయితే ఆ త‌ర‌వాత త‌న నుంచి స‌రైన సినిమాలు రాలేదు. కాక‌పోతే మంచి స్టోరీ టెల్ల‌ర్ అనే పేరు మాత్రం తెచ్చుకొన్నాడు. ‘రిప‌బ్లిక్‌’ వ‌చ్చి మూడేళ్ల‌యిపోయింది. అప్ప‌టి నుంచీ దేవాక‌ట్టా ఖాళీనే. అయితే ఆయన త్వ‌ర‌లో నానితో ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ‘స‌రిపోదా శ‌నివారం’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు దేవాక‌ట్టా హాజ‌ర‌య్యారు. నానితో సినిమాలు చేస్తున్నవాళ్లు, చేసిన ద‌ర్శ‌కులు ఈ వేదిక‌పై క‌నిపించారు. దేవాక‌ట్టాతో త్వ‌ర‌లోనే నాని సినిమా చేస్తాడ‌ని, అందుకే ఈ ఫంక్ష‌న్‌కి ఆయ‌న హాజ‌రయ్యార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. నానితో సినిమా చేయాల‌ని దేవాక‌ట్టా ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. కొన్ని క‌థ‌లు కూడా వినిపించారు. కానీ ఎందుకో అవి సెట్ అవ్వ‌లేదు. ఈసారి మాత్రం ఈ కాంబో ఫిక్స్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. నాని నిర్మాత‌గానూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న నిర్మాణంలో ప‌లు చిత్రాలు సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రెడీ అవుతున్నాయి. అయితే దేవా క‌ట్టా సినిమాకు నాని ప్రొడ్యూస్ చేస్తాడా, లేదంటే హీరోగా న‌టించ‌బోతున్నాడా? అనే విష‌యాలు మాత్రం తెలియాల్సివుంది. ఈ రెండింటిలో ఏది జ‌రిగినా దేవా క‌ట్టా త‌దుప‌రి చిత్రానికి కాస్త క్రేజ్ వ‌చ్చిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రైతు భరోసాపై సర్కార్ కీలక ప్రకటన

రెండు లక్షల రుణమాఫీ పేరుతో హడావిడి చేసి రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ పదేపదే విమర్శలు చేస్తోంది. రైతు భరోసాను ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎవరికి రైతు...

సత్య.. ది వన్ అండ్ ఓన్లీ…

సునీల్ తర్వాత మళ్ళీ ఆలాంటి కమెడియన్ దొరుకుతాడా? అనే ప్రశ్నకు సమాధానంగా కనిపించాడు సత్య. సునీల్ ని ఇమిటేట్ చేస్తున్నాడనే విమర్శలని బిగినింగ్ లో ఎదురుకున్నాడు. ఆ విమర్శలలో కొంతం వాస్తవం కూడా...
video

దేవర ముందర బావ బావమరిది

https://www.youtube.com/watch?v=7QCGkkKiJOE 96 సినిమాతో డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ పేరు బయటికి వచ్చింది. ఆ సినిమా మ్యాజికల్ హిట్. తెలుగులో రిమేక్ మాత్రం సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు ప్రేమ్ కుమార్ నుంచి మరో సినిమా...

వేణుస్వామిపై కేసు – మూర్తి సక్సెస్

జాతకాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజే వేణు స్వామిపై కేసు పెట్టాలని హైదరాబాద్ పదిహేడో మెట్రోలిపాలిటక్ కోర్టు జూబ్లిహిల్స్ పోలీసులను ఆదేశించింది. వేణు స్వామి మహా మోసగాడు అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close