అఫీషియ‌ల్‌: ‘ద‌స‌రా’ కాంబో రిపీటే!

గ‌తేడాది టాలీవుడ్ చూసిన సూప‌ర్ హిట్స్‌లో.. ‘ద‌స‌రా’ ఒక‌టి. ఈ సినిమాతో శ్రీ‌కాంత్ ఓదెల దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. నానిని ఓ స‌రికొత్త అవ‌తార్‌లో చూసే అవ‌కాశం ఇచ్చిన సినిమా ఇది. ఆ లుక్‌, ఆ మేకొవ‌ర్ ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేశాయి. సుధాక‌ర్ చెరుకూరికి నిర్మాత‌గా పెద్ద హిట్ ద‌క్కింది. ఇప్పుడు మ‌రోసారి ‘ద‌స‌రా’ కాంబో రిపీట్ కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. నాని – శ్రీ‌కాంత్ – సుధాక‌ర్ చెరుకూరి కాంబోలో రెండో చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ఈరోజు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతే కాదు.. ఓ ప్రీలుక్ పోస్ట‌ర్‌ని కూడా వ‌దిలారు. `ద‌స‌రా`లోలానే నాని మ‌రోసారి విభిన్న‌మైన లుక్‌లోకి మారిపోయాడు. నిజ‌మైన నాయ‌కుడికి ఐడెంటిటీ అవ‌స‌రం లేద‌న్న స్లోగ‌న్ పోస్ట‌ర్‌పై క‌నిపిస్తోంది. ఈసారి ఓ మాస్ లీడ‌ర్ క‌థ చెప్పబోతున్నార‌న్న హింట్.. ఈ ప్రీ లుక్ పోస్ట‌ర్‌తో ఇచ్చేసింది చిత్ర‌బృందం. 2025లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం నాని `స‌రిపోదా శ‌నివారం`తో బిజీగా ఉన్నాడు. అది నాని 32వ సినిమా. శ్రీ‌కాంత్ ఓదెల‌ది నాని 33వ సినిమా కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close