బాలకృష్ణ ‘ఆహా’లో అదరగొడుతున్నారు. అన్స్టాపబుల్ షో ని హుషారుగా నడుపుతున్నారు. మోహన్ బాబు తో మొదటి ఎపిసోడ్ విజవంతమైయింది. ఇప్పుడు రెండో ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. ఈ ఎపిసోడ్ లో వచ్చిన గెస్ట్ హీరో నాని. ‘ఈరోజు మన గెస్ట్ మీ నుంచి వచ్చాడు. సెల్ఫ్మేడ్కి సర్నేమ్’ అంటూ నానిని ఉద్దేశించి బాలయ్య చెప్పిన మాటలతో ప్రారంభమైన ప్రోమో ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
బాలకృష్ణ-నాని కాసేపు క్రికెట్ ఆడటం.. అభిమానులు ‘జై బాలయ్య’ అంటుంటే ‘మీరు ఆగండ్రా. టెన్షన్ పెట్టకండి’ అని బాలకృష్ణ తనదైన శైలిలో చెప్పి నవ్వులు పంచారు. ‘ఒత్తిడి తగ్గించుకునేందుకు నువ్వు ఏం చేస్తావ్? ఎలా రిలాక్స్ అవుతావ్’ అని బాలకృష్ణ అడగ్గా ‘సినిమాలు చూస్తా’ సర్ అని నాని చెప్పిన అన్సర్ కి ‘పులిహోర కబుర్లు చెప్పొద్దు’ అంటూ బాలకృష్ణ ఇచ్చిన పంచ్ నవ్వులు పూయిచింది. ఇక చివర్లో… ”నా సక్సెస్ నాదే .. నా ఫెయిల్యూర్ నాదే అనుకుంటే.. వి విల్ బి ట్రూలీ అన్స్టాపబుల్ అని నాని చెప్పడం కూడా ఆకట్టుకుంది. ఈ ఎపిసోడ్ నవంబర్ 12న ప్రసారం కానుంది.