నాని మరోసారి నిర్మాతగా మారుతున్నాడు. డీ ఫర్ దోపిడీ తరవాత.. నాని నుంచి ఓ సినిమా రాబోతోంది. అయితే ఈసారి కామ్‌గా, గప్ చుప్ గా తన సినిమాని కూడా పూర్తి చేసేశాడు. ఇంకో స్పెషల్ ఏమిటంటే… ఇదో భారీ మల్టీస్టారర్. నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్లతో నాని ఈ సినిమాని ప్లాన్ చేశాడు. అయితే ఇదేం కమర్షియల్ సినిమా కాదు. ఓ ప్రయోగాత్మక చిత్రం. ఈ సినిమాలో పనిచేసినవాళ్లంతా నామ మాత్రపు పారితోషికంతో సినిమా ఒప్పుకొన్నారని తెలుస్తోంది. దర్శకుడు కూడా కొత్తవాడే. అయితే ఈ సినిమాలో నాని నటించలేదు. కేవలం నిర్మాతగా బాధ్యతలు స్వీకరించాడంతే! ఈ సినిమా పూర్తయ్యాకే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేయాలని నాని భావిస్తున్నాడు. ప్రమోషన్లు కూడా చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు నాని. పెద్ద స్టార్లున్న ఈ చిన్న సినిమా గురించిన వివరాలు అతి త్వరలో తెలుస్తాయి. ఆ నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్లు ఎవరన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్సే! నాని హీరోగా నటించిన ఎంసీఏ డిసెంబరులో విడుదల కాబోతోంది. ఆ తరవాతే… ఈ మల్టీస్టారర్ ప్రమోషన్లు ప్రారంభం కానున్నాయని సమాచారం.