అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం జ్యో అచ్యుతానంద. నారా రోహిత్, నాగశౌర్య కథానాయకులుగా నటించారు. రెజీనా హీరోయిన్. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరో కూడా అడుగుపెట్టాడని సమాచారం. అతనే.. యంగ్ హీరో నాని. ఇందులో అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశంలో.. నాని ఎంట్రీ ఇస్తాడని, అది అదిరిపోయే స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. అయితే.. నాని ఉన్నాడని తెలిస్తే స్టోరీ ఎక్కడ రివీల్ అయిపోతుందో, ఆ ఆసక్తి ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడుతోంది చిత్రబృందం. అందుకే.. నాని ఉన్నాడన్న సంగతే చెప్పడం లేదు.
యంగ్ హీరోల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ నడుస్తోందిప్పుడు. అందుకే.. నానిలాంటి వాళ్లు గెస్ట్ రోల్స్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. పైగా.. వారాహి చలనచిత్రం సంస్థతో నానికి ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. వాళ్ల సినిమా `ఈగ`తోనే నాని మరింత పాపులర్ అయ్యాడు. ఆ అనుబంధంతోనే… అతిథి పాత్ర చేసేశాడట నాని. ఈ సినిమాలో ఇంకా చాలా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని, అవి ఒకొక్కటీ బయటకు వదులుతారని సమాచారం. ఈనెలలోనే ఈచిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.