ఈ రోజుల్లో ప్రమోషన్స్ చాలా కీలకం. ఒక మంచి ప్రాజెక్ట్ చేతిలో వుంటే సరిపోదు, దాన్ని జనాల దగ్గరకి తీసుకువెళ్ళాలి. బలంగా ప్రమోట్ చేయాలి. మేకింగ్ కి ఎంత ప్రాధాన్యత వుంటుందో.. ప్రమోషన్స్ కి కూడా అంటే ప్రాధన్యత ఏర్పడిందిప్పుడు. రాజమౌళి లాంటి దర్శకులు ప్రమోషన్స్, మార్కెటింగ్ ని కొంత పుంతలు తొక్కించారు. ఆ బాటలో ఇప్పుడు మిగతా వారు పయనిస్తున్నారు. ఇప్పుడు నాని కూడా ‘దసరా’ విషయంలో ఇదే మార్గంలో వెళ్తున్నాడు.
‘దసరా’ ప్రమోషన్స్ కోసం ఏకంగా నెలరోజులు కేటాయించాడు నాని. ఒక సినిమా ప్రమోషన్స్ కి నెల రోజులు కేటాయించడం అంటే చాలా ఎక్కువ సమయమే అని చెప్పాలి. నెల రోజుల్లో ఒక సినిమాని పూర్తి చేసుకుంటారు కొందరు. కానీ నాని మాత్రం కేలవం ప్రమోషన్స్ కోసం నెల రోజులు కేటాయిండం విశేషం. దసరాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. పాన్ ఇండియా అనే టైటిల్ పెట్టేస్తే సరిపోదు. పాన్ ఇండియా ప్రమోషన్స్ వుండాలి. కంటెంట్ విషయంలో కాన్ఫిడెంట్ గా వున్న నాని.. దేశ వ్యాప్తంగా తిరిగి దసరాని ప్రచారం చేయాలనే ప్రణాళిక వేశారు. నాని ఆసక్తిని చూసి నిర్మాతలు కూడా హ్యాపీగా వున్నారు. మార్చి 30న దసరా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.