మల్టీస్టారర్ విలువ తెలిసిన కథానాయకుడు నాని. తను హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘అష్టాచమ్మా’ ఓ మల్టీస్టారరే. ఆతరవాత చేసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కూడా ఓ రకంగా ఇద్దరుహీరోల కథే. ‘దేవదాస్’తో ఓ పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమా చేసేశాడు నాని. ఇప్పుడు మరోసారి ఇద్దరు హీరోల కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నాని కోసం ఇంద్రగంటి మోహన కృష్ణ ఓ కథని సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నాని.అయితే ఇది కూడా ఓ మల్టీస్టారర్ చిత్రమే. మరో కథానాయకుడిగా దుల్కర్సల్మాన్ని ఎంచుకోవాలన్నది ఇంద్రగంటి ఆలోచన. నాని కూడా దుల్కర్ అయితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడట. ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే దిల్ రాజు దుల్కర్‌తో సంప్రదింపులు జరిపారని, అయితే దుల్కర్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నాని విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు `జర్సీ` కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి రెండూ పూర్తయితే గానీ.. ఇంద్రగంటి సినిమా పట్టాలెక్కదు. ఈలోగా దుల్కర్ తన సమ్మతిని తెలియ చేశాడంటే… కచ్చితంగా ఈ కాంబో టాలీవుడ్‌ని షేక్ చేసేస్తుంది.