తానో హీరోగా మంచి పొజిషన్ కి వచ్చాక తనలాంటి టాలెంటెడ్ హీరోలకు అవకాశాన్ని ఇవ్వలేకపోయినా కొత్తవారైన దర్శకులకు అవకాశం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాడు నాని. భలే భలే మగాడివోయ్ సినిమాతో స్టార్ రేంజ్ కు వెళ్లిన ఈ హీరో రీసెంట్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ కూడా హిట్ కొట్టేసరికి.. నానితో సినిమా కోసం దర్శక నిర్మాతలు వెంటపడుతున్నారు. అయితే కెరియర్ మొదట్లో మంచి జోష్ మీదున్న నాని సీనియర్ దర్శకులను నమ్ముకుని మోసపోయాడన్నది వాస్తవం. అందుకే ఇప్పుడు రూట్ మార్చి టాలెంట్ ఉన్న యువ రక్తానికే అవకాశాన్ని ఇస్తున్నాడు.
ప్రస్తుతం తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నాని తన తర్వాత సినిమా ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మతో చేసేందుకు సిద్ధమయ్యాడట. విరించి చెప్పిన కథకు ఫిదా అయిన నాని అతని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక అది కాకుండా లాస్ట్ ఇయర్ చివర్లో భలే మంచి రోజు అంటూ సుధీర్ బాబుతో సడెన్ గా వచ్చి మంచి హిట్ కొట్టిన శ్రీ రాం ఆదిత్య కూడా నానికి దిమ్మతిరిగే కథ చెప్పాడట.
శ్రీ రాం ఆదిత్య లాంటి కసి ఉన్న దర్శకులంటే ఇష్టమున్న నాని అతని సినిమాకు కూడా ఓకే చెప్పాడట. మరి చూస్తుంటే నాని కొత్త వారిని ఎంకరేజ్ చేసే పని పెట్టుకున్నట్టు అనిపించినా వారిలో ఉన్న ఆ టాలెంట్ మేరకే అవకాశం ఇస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఈ అంశాలు కలిసి వచ్చి నానికి ప్రస్తుతం ఉన్న హిట్ మేనియాను కంటిన్యూ చేసేట్టుగా చూస్తాయో లేదో చూడాలి.