వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో సూపర్ హిట్టు కొట్టాడు మేర్లపాక గాంధీ. ఆ వెంటనే ఎక్స్ప్రెస్ రాజా. అది కూడా మంచి హిట్టే. ఆ తరవాత వరుసగా అవకాశాలొచ్చాయి. నానితో `కృష్ణార్జున యుద్ధం` తీశాడు. అదెందుకో వర్కవుట్ కాలేదు. మళ్లీ.. `ఏక్ మినీ కథ`, `మాస్ట్రో` లాంటి సినిమాలతో ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు సంతోష్ శోభన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అది దాదాపుగా పూర్తి కావొచ్చింది. త్వరలోనే నానితో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకొన్నాడని టాక్.
`కృష్ణార్జున యుద్ధం` ఫ్లాప్ అయినా.. మేర్లపాక గాంధీపై నానికి భరోసా ఉంది. పైగా నాని ట్రాక్ రికార్డుల్ని కాకుండా కథని నమ్మే వ్యక్తి. అందుకే మేర్లపాక గాంధీకి ఇప్పటికీ గేట్లు తెరచుకునే ఉన్నాయి. నాని బాడీ లాంగ్వేజ్ కి తగిన ఓ కథని గాంధీ సిద్ధం చేశాడని, ఈ లైన్ నానికి కూడా బాగా నచ్చిందని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పై వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. సంతోష్ శోభన్ సినిమా బయటకు వచ్చి, అది హిట్టయితే… అప్పుడు మేర్లపాక – నాని సినిమా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్టే.