హరిప్రియ తెలుసు కదా? తెలుగులో ఎంత ప్రయత్నించినా.. అదృష్టం కలసి రాక ఫేడవుట్ అయిపోయిన కథానాయిక. నానితో పిల్లజమిందార్లో నటించింది. వరుణ్ సందేశ్ సినిమాలో వేశ్యగా కనిపించింది. తెలుగులో ప్రతిభ చూపించలేకపోయినా కన్నడలో మంచి అవకాశాల్నే అందిపుచ్చుకొంది. అక్కడ హరి ప్రియ ఓ హాట్ గాళ్. ఇప్పుడు ఓ కన్నడ సినిమా కోసం మరింత హాట్‌గా ముస్తాబైంది. నీర్ దోశె అనే కన్నడ సినిమాలో నటించింది హరిప్రియ. విజయ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జగ్గేష్ హీరో. మరో హాట్ గాళ్ సుమన్ రంగనాథ్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా మేకింగ్ విజువల్స్ కన్నడలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అందులో హరి ప్రియ పోజులు.. హాట్ హాట్ ఎక్స్పోజింగ్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.
తెలుగులో పద్ధతిగా కనిపించిన ఈ అమ్మాయి కన్నడలో మరీ ఇంత రెచ్చిపోవడం షాకింగ్ విషయమే. ఈ సినిమా బయటకు వస్తే హరి ప్రియ పేరు మార్మోగడం ఖాయమని కన్నడ వాసులే చెబుతున్నారు. నీర్ దోశెకి సంబంధించిన పోస్టర్లు బయటకు వచ్చాయో లేదో… కన్నడ నాట మరో రెండు సినిమాల్లో నటించే ఆఫర్ అందుకొందట హరిప్రియ. అదే జోరులో తెలుగు సినిమాలు కూడా దరి చేరతాయన్న నమ్మకంతో ఉంది. మరి ఏం జరుగుతుందో? ఈ ఎక్స్పోజింగులకు వచ్చే ప్రతిఫలమెంతో కాలమే చెప్పాలి.