నాని ప్లానింగ్ ఎప్పుడూ పర్ఫెక్ట్ గానే ఉంటుంది. హీరోగా చేసినా, నిర్మాతగా ఓ సినిమా బయటకు వదిలినా ఓ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంటాడు. అదే.. మంచి ఫలితాల్నీ అందిస్తుంటుంది. హిట్ 3 అనేది నాని లైనప్ లో లేదు. చేయాలనుకొన్నా, దానికి కొంత టైమ్ ఉంది. కానీ.. సడన్ గా హిట్ 3ని ముందుకు తీసుకొచ్చి, చక చక పూర్తి చేసి ఇప్పుడు మే 1న విడుదలకు సిద్ధం చేశాడు. ట్రేడ్ పరంగా చూస్తే హిట్ 3 విడుదలకు ముందే లాభాల్లోకి వెళ్లిపోయింది. నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచే దాదాపు రూ.100 కోట్లు వచ్చాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నాని పారితోషికం (రూ.25 నుంచి 30) కోట్లు కలుపుకొన్నా.. ఈ సినిమాకు రూ.80 కోట్లకు మించి బడ్జెట్ అవ్వదు. అంటే.. నాన్ థియేట్రికల్ రూపంలోనే డబ్బులు వచ్చేసినట్టు. ఇక థియేటర్ నుంచి వచ్చిన ప్రతీ రూపాయీ లాభమే.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగులు ఊపు మీద ఉన్నాయి. లాంగ్ వీకెండ్ మరో ప్లస్ పాయింట్. ఈమధ్య కాలంలో… థియేటర్లకు వెళ్లడానికి బద్దకిస్తున్నారు ఆడియన్స్. వాళ్లకు `హిట్ 3` మంచి ఆప్షన్. ఎలా చూసినా ఈ సినిమాతో నాని జాక్ పాట్ కొట్టినట్టే. చిన్న సినిమా ‘కోర్ట్’ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా పెట్టుబడి మొత్తం ఓటీటీ హక్కుల రూపంలోనే తిరిగి వచ్చేశాయి. థియేటర్ నుంచి వచ్చిందల్లా ప్రాఫిట్టే. ఇప్పుడు ‘హిట్ 3’ విషయంలోనూ ఇదే జరుగుతోంది.
ఈసారి నాని పాన్ ఇండియా మార్కెట్ పై మరింత దృష్టి పెట్టాడు. నార్త్ లో ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నాడు. యాక్షన్ సినిమా కాబట్టి, అక్కడ్నుంచి కూడా ఆదరణ బాగుంటుందన్నది నాని భరోసా.