మైత్రీ మూవీస్ అడ్వాన్సులు ఇచ్చిన దర్శకుల జాబితాలో చంద్రశేఖర్ యేలేటి పేరు కూడా ఉంది. ఆయన ప్రస్తుతం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ కథ గోపీచంద్ కోసమే అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే… గోపీచంద్ మాత్రం `అదేం లేదు` అని క్లారిటీ ఇచ్చేశాడు. నిజానికి చందూ రాస్తున్న కథ హీరో ఓరియెంటెడ్ కాదట. హీరోయిన్ ఓరియెంటెడ్ అని తెలుస్తోంది. అది అనుష్క కోసమేనని సమాచారం. అనుష్కకి కూడా మైత్రీ మూవీస్ ఇది వరకే అడ్వాన్స్ ఇచ్చింది. కాబట్టి ఈ కాంబో కుదరడం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. అసలైన ట్విస్టేంటంటే… ఇందులో నాని కథానాయకుడిగా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మైత్రీ కూడా నానికి ఇది వరకే అడ్వాన్స్ ఇచ్చింది. మైత్రీలో నాని ఓ సినిమా చేయాల్సిందే. ఆ సినిమా ఇదే అని టాక్. నాని – అనుష్క ఆసక్తికరమైన కాంబినేషనే. మరి నాని ఇందులో హీరోనా, లేదంటే కథని మలుపుతిప్పే పాత్రలో కనిపించబోతున్నాడా? అనేది తేలాల్సివుంది.