బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అవడంతో రెండో సీజన్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కంటెస్టెంట్లు ఎవరనేదానిపై రెండు నెలలుగా విపరీతమైన చర్చ జరిగింది. ఈ చర్చ ఎంత వరకూ వెళ్లిందంటే… శ్రీరెడ్డి సహా..వివాదాల్లో… వెలుగులోకి వచ్చిన తారల లక్ష్యమంతా ఎలాగోలా బిగ్‌బాస్‌లో చాన్స్ కొట్టేయడమేనని ప్రచారం జరగింది. దీనికి తగ్గట్లుగానే వరుసగా వివాదాలు వచ్చాయి. ఎప్పుడూ బయకు రాని మాధవీలత లాంటి ఔట్‌డేటెడ్ హీరోయిన్లు కూడా… ధర్నాల పేరుతో హంగామా చేశారు. అయితే విచిత్రంగా శ్రీరెడ్డి రేపిన వివాదమే అన్నింటికీ మూలం అయింది. కానీ ఆమెకు మాత్రం బిగ్‌బాస్ బెర్త్ దొరకలేదు. చివరి క్షణం వరకూ ఆమె పేరు ఉందని ప్రచారం జరిగింది. లాస్ట్‌కు మిస్ అయింది.
ఈ కోపమో.. మరేమిటో కానీ… ఆమె తన ప్రతాపాన్ని హోస్ట్ నాని మీద చూపించడం ప్రారంభించింది. గతంలో కూడా.. నానిని ఉద్దేశించి డైరక్ట్‌గా పేరు పెట్టకుండా.. నేచురల్ స్టార్ అని..మరోకటిని సంబోధించి రచ్చ బాగానే చేసింది. దానిపై నాని అప్పుడు స్పందించ లేదు. ఇటీవల తనకు బిగ్‌బాస్‌లో బెర్త్ లేదని కన్ఫర్మ్ అయిన తర్వాత.. శ్రీరెడ్డి మరిన్ని ఘాటు పోస్టులు పెట్టడం ప్రారంభించింది. నాని పర్సనల్ లైఫ్‌ని టార్గెట్ చేసి… ఈ పోస్టులు ఉన్నాయి. దీంతో నాని బిగ్ బాస్ షో ప్రారంభమైన తర్వాతి రోజే.. లీగల్ నోటీసులు పంపించారు. తను కూడా స్పందించారు. సహనానికి ఓ హద్దు ఉంటుందన్నారు. ఇక స్పందించనన్నారు కూడా. కానీ శ్రీరెడ్డికి ఈ మాత్రం చాలదా…? అసలు బిగ్‌బాస్‌ను మించే షో బయట చూపించడానికి..?
గతంలో శ్రీరెడ్డి శేఖర్ కమ్ముల సహా చాలా మందిపై ఆరోపణలు చేసింది. కానీ వారెవరూ స్పందించలేదు. స్పందిస్తే.. అనవసరంగా ఆమె ఆరోపణలకు క్రెడిబులిటి కల్పించినట్లవడంతో పాటు.. .ఇష్యూని అంతకంతకూ పెద్దది చేసుకుంటూ వెళ్లడమేనని సైలెంటయిపోయారు. కానీ నాని మాత్రం అనూహ్యంగా ఆమెపై న్యాయపోరాటం అంటూ రంగంలోకి దిగారు. అసలు శ్రీరెడ్డి చూస్తున్నది కూడా… ఇలాంటి రియాక్షన్ కోసమే. నాని హోస్ట్‌గా ఉన్న బిగ్‌బాస్‌పై ఉన్న అటెన్షన్‌ను… మరల్చడానికే..శ్రీరెడ్డి… ఈ ఆరోపణలు చేస్తుందన్న విషయాన్ని నాని గుర్తించలేకపోయారు. ట్రాప్‌లో పడిపోయారు.
నాని పంపిన నోటీసులు అందుకున్న తర్వాత శ్రీరెడ్డి.. అవుట్డోర్ బిగ్ బాస్ స్టార్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి నాని కావాలనే ఇరుక్కుపోయాడనే అభిప్రాయం సినీ వర్గాల్లో ఉంది. ఇప్పటికే ఆమె చెప్పే మాటలు ఎవరూ నమ్మడం లేదు కాబట్టి… అవి గాసిప్స్‌గానే మిగిలిపోతాయి. ఒక వేళ శ్రీరెడ్డి తర్వాత క్షమాపణలు చెప్పినా.. ఆ గాసిప్స్ ఆగవు. ఇప్పుడు న్యాయపోరాటం వల్ల కొత్తకొత్తవి పుట్టుకొస్తాయి. దీనికి నాని రెడీగా ఉండాలి.. మరి..!
[pdf-embedder url=”https://www.telugu360.com/te/wp-content/uploads/sites/2/2018/06/Actor-Nani’s-legal-notices-to-Sri-Reddy.pdf” title=”Actor Nani’s legal notices to Sri Reddy”]