రాజ్ తరుణ్ హీరోగా నటించిన తాజా సినిమా ‘రాజుగాడు’. అంతకుముందు మీడియాలో కొన్నాళ్లు పనిచేసి, తర్వాత వర్మ దగ్గర ‘రౌడీ’ సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేసిన మహిళ సంజానా రెడ్డి ఈ సినిమాకి దర్శకురాలు. ఇందులో తనకు తెలియకుండానే ఇతరుల వస్తువులు కొట్టేసే జబ్బు వున్న యువకుడి పాత్ర హీరోది. ఈ పాత్రకి, సినిమాకి ఇన్స్పిరేషన్ నాని హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ అని సంజానా రెడ్డి స్పష్టం చేశారు. ‘భలే భలే మగాడివోయ్’లో నాని మతిమరుపు వున్న కుర్రాడిగా నటించి వినోదం పండించాడు. రాజ్ తరుణ్ హీరోగా సినిమా చేద్దామని అతనితో డిస్కస్ చేస్తున్న సమయంలో ‘భలే భలే మగాడివోయ్’ చూశామని… ఇటువంటి జబ్బులు ఏమైనా వున్నాయా ఆరా తీయగా ‘kleptomania’ దొరికిందని దర్శకురాలు తెలిపారు. నాని పాత్రతో, రాజ్ తరుణ్ పాత్రను కంపేర్ చేస్తారని ముందుగా చెబుతున్నారామె. ప్రతి ఒక్కరిలో ఈ వ్యాధి లక్షణాలు కొంచెం కొంచెం ఉంటాయని అంటున్నారు. చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ పెన్సిల్స్ కొట్టేయడం గట్రా ఈ వ్యాధి లక్షణాలే అని చెప్పారు. అందరిలో 0.001 పెర్సెంట్ ఈ లక్షణాలు వుంటే… తనలో 0.9 పెర్సెంట్ వున్నాయని సంజనారెడ్డి నవ్వేశారు. హ్యార్లీ డేవిడ్సన్ బైక్ లోగోస్, కార్ లోగోస్, కీ చైన్స్ కొట్టేయడం ఆమెకు అలవాటు అట!
‘భలే భలే మగాడివోయ్’లో నానికి మతిమరుపు అయితే… ‘రాజుగాడు’లో రాజ్ తరుణ్‌కి సరదాగా దొంగతనం చేసే అలవాటు. ఈ జబ్బుల వల్ల హీరోలకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేవి కథలు. వెండితెరపై ఎంత వినోదం పండించాలో… అంత వినోదం పండించడం కాన్సెప్ట్. అంతకు ముందు రాజ్ తరుణ్ ఇటువంటి సినిమా ఒకటి చేయాడు ‘అంధగాడు’లో అంధుడిగా నటించాడు. ఇప్పుడీ సినిమాలో ఈ జబ్బు. ఎవరిదో సినిమా సక్సెస్ అయ్యిందని అదే ఫార్ములా అనుసరించి సేఫ్ రూటులో సినిమాలు చేస్తున్నాడన్న మాట!!