నాని కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘జెర్సీ’. క్రికెట్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నాని నటించబోతున్నాడు. ఈ చిత్రంలో కథానాయిక కోసం చాలా రోజుల నుంచి అన్వేషణ జరుగుతోంది. ఎట్టకేలకు కథానాయికని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాతో శ్రద్ద శ్రీనాధ్ టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. అజిత్ నటించిన ‘విక్రమ్ వేద’తో శ్రీనాథ్ పాపులర్ అయ్యింది. కన్నడ ‘యూటర్న్’లో కథానాయిక శ్రద్దనే. `దేవదాస్` చిత్రంలో శ్రద్దని కథానాయికగా ఎంచుకుందామనుకున్నారు. కానీ కుదర్లేదు. ఈసారి మాత్రం.. శద్ర ఎంట్రీ ఖాయమైపోయింది. గౌతమ్ తెన్నునూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం నాని క్రికెట్ కోచింగ్ కూడా తీసుకున్నాడు.