కృష్ణగారు కృష్ణుడు టైపు. ఊళ్ళో కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కాని ఎవరూ అతడికి పడలేదు. ఒక్క అమ్మాయి తప్ప. ఇక, భారతీయ మూలాలు వున్న రాక్‌స్టార్ అర్జున్‌కి అమ్మాయిల్ని పడేయడం చిటికెలో పని. ఎక్కువ రోజులు ఏ అమ్మాయినీ ప్రేమించడు. అలాంటోడు ఒక అమ్మాయి దగ్గర ఆగుతాడు. ఇంటర్వెల్ వరకూ ఈ ఇవే కథలు. ఎవరి దారి వాళ్లది. కృష్ణ, అర్జున్ మధ్య ఎలాంటి పరిచయం వుండదు. ఒకరికి ఒకరు తెలియదు. ఇంటర్వెల్ ముందు అమ్మాయి కోసం అర్జున్ ఇండియాకి వస్తాడు. ఇక్కడికి వచ్చిన తరవాత అమ్మాయి ఆపదలో పడుతుంది. అలాంటి ఆపదే కృష్ణ ప్రేమించిన అమ్మాయికీ ఎదురవుతుంది. ప్రేమించిన అమ్మాయిల కోసం వెళితే… ఒకరికి ఒకరు ఎదురుపడతారు. అప్పట్నుంచి ఇద్దరూ కలిసి ఎలాంటి యుద్ధం చేస్తారు? ఎందుకోసం యుద్ధం చేస్తారు? అనేది సిన్మా స్టోరీ. కృష్ణ, అర్జున్ పాత్రలో నేచురల్ స్టార్ నాని సహజంగా నటిస్తే, దర్శకుడు మేర్లపాక గాంధీ ఫుల్ కామెడీతో సినిమాను తీశాడని సమాచారమ్. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో అనుపమా పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లు.