నిన్నుకోరి కాంబినేషన్ మరోసారి పట్టాక్కబోతోంది. నాని కథానాయకుడిగా – శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతోంది. సన్‌షైన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. త్వరలోనే క్లాప్ కొట్టనున్నారు. ఈ చిత్రానికి టైటిల్ కూడా ప్రకటించేశారు. అదే ‘టక్ జగదీష్’. ఫ్యాంటులోపలకు షర్టు దూర్చి – టక్ చేసుకున్న నాని ఫొటోని పోస్ట్ టైటిల్లోగోతో పాటు విడుదల చేశారు. టైటిల్ వెరైటీగా ఉంది. టైటిల్‌తో పాటు నాని క్యారెక్టరైజేషన్ కూడా ఈ సినిమాలో వింతగా ఉండబోతోందని తెలుస్తోంది. మజిలీ తరవాత శివ నిర్వాణ చేస్తున్న సినిమా ఇది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. నాని సినిమా `వీ` ముసిగిన వెంటనే ఈ చిత్రం పట్టాలెక్కబోతోంది.