హీరో నానితో దర్శకుడు ఇంద్రగంటి చేయబోయే ప్రాజెక్టు ఫైనల్ అయింది. గత కొన్నాళ్లుగా వార్తల్లో వున్న ఈ ప్రాజెక్టు ఫైనల్ మీటింగ్ నిన్నరాత్రి జరిగింది. అయితే నానితో ఇంద్రగంటి చేయబోయే సినిమా మల్టీ స్టారర్ నా? సోలోనా? అన్నది ప్రస్తుతానికి సస్సెన్స్.
మల్టీ స్టారర్ కావడానికే ఎక్కువ చాన్స్ వుంది. ఈ సినిమాను విక్రమ్ కుమార్ సినిమా చేస్తూనే నాని ఈ సినిమాను కూడా చేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే దిల్ రాజు ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది ఆరంభంలో కానీ విడుదల చేయాలనుకుంటున్నారు.
పైగా ఈ సినిమాకు నాని డేట్స్ మరీ ఎక్కువ అవసరం పడవని తెలుస్తోంది. మల్టీ స్టారర్ అయితే ఇద్దరు వుంటారు కాబట్టి, నాని అనుకూలతను బట్టి, ఆయన సీన్లు చేసేసుకోవచ్చు. పైగా రెండో హీరో ను డేట్ లు సమస్య లేని వారిని తీసుకుంటే మరీ సులువుగా వుంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్లు బోగట్టా.