స్టార్ దర్శకులలో శిష్యుల గురించి పట్టించుకుంటోంది సుకుమారే. ఎందుకంటే.. తన శిష్యుల్ని దగ్గరుండి దర్శకులుగా ప్రమోట్ చేస్తున్నాడు సుక్కు. కుమారి 21 ఎఫ్, దర్శకుడు.. ఇప్పుడు ఉప్పెన, 18 పేజీస్… ఇలా సినిమాలన్నీ సుకుమార్ సారథ్యంలో, సుకుమార్ శిష్యులు తీసినవే. వాటిని సహ నిర్మాతగా వ్యవహరించాడు సుకుమార్. ఇప్పుడు సుకుమార్ నుంచి మరో శిష్యుడు రాబోతున్నాడు. సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన శ్రీకాంత్ అనే కుర్రాడు త్వరలోనే మెగా ఫోన్ పట్టబోతున్నాడు. నానికి శ్రీకాంత్ ఓ కథ చెప్పి ఒప్పించాడట. ఈసినిమాని సుకుమార్ రైటింగ్స్ సంస్థ తెరకెక్కించే అవకాశాలున్నాయి. లాక్ డౌన్ ఎత్తేశాక ఈసినిమాపై ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. చూస్తుంటే… సుకుమార్ రైటింగ్స్.. సుకుమార్ శిష్యులకు అంకితమైపోయేట్టే కనిపిస్తోంది. ఓ దర్శకుడు తన శిష్యుల్ని ఈ స్థాయిలో ప్రోత్సహించడం గొప్ప విషయమే.