నాగార్జున – దాసరి కాంబినేషన్లో వచ్చిన సినిమా మజ్ను. ఆ సినిమా పెద్దగా ఆడలేదు గానీ… టైటిల్‌కి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఆ టైటిల్‌ని వాడేద్దామనుకొన్నాడు అక్కినేని వారసుడు నాగచైతన్య. చందూ మొండేటితో తీస్తున్న ప్రేమమ్ రీమేక్‌కి.. ముందు మజ్నునే టైటిల్ అని అనుకొన్నారు. కానీ ఎందుకనో ఆ టైటిల్‌ని పక్కన పెట్టేశారు. ప్రేమమ్ ఇమేజ్ క్యాష్ చేసుకొందామన్న ఉద్దేశంతోనో ఏమో.. అదే టైటిల్‌ని రిపీట్ చేసేశారు. దాంతో మజ్ను టైటిల్ అలానే ఉండిపోయింది. ఆ టైటిల్‌పై ఇప్పుడు నాని దృష్టి పడింది.
ఉయ్యాల జంపాలతో తొలి అడుగులోనే విజయం సాధించిన దర్శకుడు విరించి వర్మ. ఇప్పుడు నానితో జట్టు కట్టాడు. నాని – విరించి వర్మ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మజ్ను అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు టాక్. మొన్నే జెంటిల్మెన్తో హిట్టు కొట్టాడు నాని. అంతకు ముందు పిల్ల జమిందార్ కూడా పాత టైటిలే. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఈ సినిమాకీ వర్కవుట్ చేసేద్దామని ఫిక్స్ అయినట్టు టాక్. అయితే మజ్ను టైటిల్ ఎవరి దగ్గర ఉంది? నాని సినిమాకి వాళ్లు ఇస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాని గనుక గట్టిగా ట్రై చేస్తే.. మజ్ను టైటిల్ దక్కేయవచ్చు.