వరుస విజయాలతో దూకుడుమీదున్నాడు నాని. ఇటీవలే జెంటిల్మన్తో ఓ డీసెంట్ హిట్ తన ఖాతాలో వేసుకొన్నాడు. నాని చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. విరించి వర్మ దర్శకత్వంలో నాని ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీనికి మజ్ను అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరోవైపు నక్కిన త్రినాథ్ చెప్పిన కథకు ఓకే చెప్పాడు. బెక్కంవేణుగోపాల్, దిల్‌రాజు నిర్మాతలుగా వ్యవహరించే ఈ చిత్రానికి ‘నేను లోకల్’ అనే పేరు పరిశీలనలో ఉంది. రవితేజ ఇడియట్ సినిమాలో పూరి రాసిన పవన్ ఫుల్ డైలాగ్.. ”చంటిగాడు.. లోకల్”. ఇప్పుడు ఆ డైలాగ్‌ని ఇలా వాడుకొంటున్నాడన్నమాట. అతి త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. సినిమా చూపిస్త మావతో హిట్ కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు నక్కిన త్రినాథ్. కథలో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకొంది. ఈసారీ అలాంటి వినోదాత్మక కథనే ఎంచుకొన్నాడట. గత రెండు నెలలుగా ఈ స్క్రిప్టుని దిల్‌రాజు అండ్‌కో మరింత షార్ప్ చేస్తున్నట్టు టాక్. కథానాయిక, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు.