రోజు రోజుకీ తన ఇమేజ్, మార్కెట్ పెంచుకొంటూ పోతున్న హీరో… నాని. నాని సినిమా అంటే ఏ,బీ,సీ అంటూ తేడా లేకుండా వసూళ్లు వచ్చి పడిపోతున్నాయి. తాజాగా విడుదలైన ‘నిన్ను కోరి’ కూడా… నాని స్టామినాకు మరోసారి అద్దం పట్టింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.25 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాల అంచనాల్ని నిజం చేసింది. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ముద్రపడ్డ.. ‘నిన్నుకోరి’ కేవలం మల్టీప్లెక్స్కే పరిమితం అవుతుందని భావించారు. కాకపోతే.. అంచనాలకు భిన్నంగా బీ,సీ సెంటర్లలోనూ ‘నిన్ను కోరి’ జోరుచూపిస్తోంది. సోమవారం నుంచి కూడా వసూళ్లు నిలకడగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘మామ్’ కేవలం ఏ సెంటర్లకే పరిమితం అవ్వడం ‘రెండు రెళ్లు ఆరు’ సినిమా బాగానే ఉన్నా, సరైన ప్రచారం లేకపోవడంతో… నాని దూకుడుకి అడ్డు లేకుండా పోయింది. ఓవర్సీస్లో ‘నిన్ను కోరి’ దూసుకుపోతోంది. నాని ఎఫెక్ట్ ‘డీజే’పై బాగా పడింది. బీసీల్లో కాస్త వసూళ్లు తెచ్చుకొంటున్న ‘డీజే’ నిన్ను కోరి రావడంతో బాగా డల్ అయిపోయింది.