`వి` ని ఓటీటీలకు ఇస్తున్నప్పుడు దిల్ రాజుపై నాని చాలా ఫైట్ చేశాడు. `ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా… ఓటీటీకి ఇవ్వొద్దు` అని వెనక్కి లాగాలని చూశాడు. కానీ అప్పట్లో పరిస్థితులు అనుకూలించలేదు. `వి` ఓటీటీలో రావడం వల్లే – దానికి రావల్సిన పేరు రాలేదన్నది నాని భావన. ఇప్పుడు `టక్ జగదీష్` విషయంలోనూ నాని అలానే అడ్డుకోవాలని చూశాడు. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడం నానికి ఏమాత్రం ఇష్టం లేదు. `వి` ఓ థ్రిల్లర్. ఓటీటీ లో థ్రిల్లర్లకి మంచి ప్లేస్ ఉంటుంది. `టక్ జగదీష్` అలా కాదు. అదో ఫ్యామిలీ ఎంటర్టైనర్. కచ్చితంగా థియేరిటికల్ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. అందుకే నాని మరింత పట్టుబట్టాడు. కానీ.. ఈసారీ కూడా నాని మాట నెగ్గలేదు. ఈ సినిమా ఓటీటీకే వెళ్లిపోయింది.
అయితే ఈ సినిమాని ఇంకొన్ని రోజులు హోల్డ్ చేయడానికి నాని చేయాల్సిందంతా చేశాడట. కానీ ఓటీటీకి విడుదల చేయక తప్పని పరిస్థితి వచ్చింది. పెరుగుతున్న వడ్డీ రేట్లని దృష్టిలో ఉంచుకుని, నిర్మాతలకే నాని ఛాయిస్ వదిలేయాల్సివచ్చిందని, ఇంకొన్నాళ్లు ఈ సినిమాని ఆపితే, నిర్మాతలు భారీగా నష్టపోతారన్న భయంతోనే నాని ఈసారి కూడా వెనకడుగు వేశాడని తెలుస్తోంది. మొత్తానికి నాని నుంచి వరుసగా రెండు సినిమాలు ఓటీటీకి వెళ్లిపోయాయి. ఈసారైనా నాని ఎదురు చూసిన ఫలితం వస్తుందో రాదో..?