దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలసి చేస్తున్న సినిమా ప్యారడైజ్. ఈ సినిమా నుంచి రా స్టేట్మెంట్ అనే పేరుతో వీడియో రిలీజ్ చేశారు. టైటిల్ కి తగ్గట్టే వీడియోని ఊరనాటుగా ప్రజెంట్ చేశారు.
‘చరిత్రలో అందరూ చిలకలు పావురాలు గురించి రాసిర్రు గానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు.
ఇది కడుపు మండిన కాకుల కథ.
జమానా జమానా కెళ్ళి నడిచే శవాల కథ.
అమ్మరొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కథ.
ఒక దగడ్ వొచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు.
థూ.. అనిపించుకున్న కాకులు తల్వార్ లు పట్టినాయ్.
ఇది ఆ కాలులని ఒక్కటి చేసిన ఒక ల.. కొడుకు కథ’.. ఇది వీడియో వాయిస్ ఓవర్.
నాని లుక్ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ గా వుంది. అనిరుద్ బీజీఎం మరో ఆకర్షణ. ఈ సినిమా గురించి నాని ఎప్పుడు చెప్పినా నెక్స్ట్ లెవల్ అనేవాడు. ఈ వీడియో చూస్తుంటే నిజంగానే ఎదో నెక్స్ట్ లెవల్ లోనే ప్లాన్ చేశారనిపిస్తోంది.