తిరిగే చక్రంలో పుల్ల పెడితే ఏమౌతుందో అని తెలుసుకోవాలనే సరదా సహజంగా వుటుంది. పుల్ల విరుగుతుందా ? చక్రం విరుగుతుందా ? వేగం తగ్గుతుందా ? ఇలా తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. అలా పెట్టిన తరవాత తెలిసొచ్చే నీతి ఏమిటంటే…. ”తిరిగే చక్రంలో పుల్ల పెట్టకూడదు”. పెడితే నష్టం తప్పదు. అని. ఇప్పుడీ సామెత పరిచయం ఎందుకంటే హీరో నాని కోసం. నాని ఇపుడు ఫుల్ ఫాం లో వున్నాడు. వరుసగా నాలుగు హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడివీర ప్రేమగాథ, జెంటిల్మెన్, మజ్ను ఇలా వరుస సక్సెస్ లు చూశాడు. ఇప్పుడు నేను లోకల్ అంటూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు మనోడి మనసు విలనిజంపై మళ్లిందట. ”ఓ మంచి విలన్ రోల్ కోసం ఎదురుచూస్తున్న. ఎవరైనా సప్రదించవచ్చు” అంటున్నాడు నాని.
హీరోలు విలనిజం పడించడం కొత్తేం కాదు. చాలా మంది హీరోలు విలన్ గా వచ్చి హీరోలుగా టర్న్ తీసుకున్నవారే. అయితే హీరోగా స్థిరపడిపోయినా తర్వాత మళ్ళీ విలన్ పాత్రలు వైపు చూడాలంటే ఒక రకమైన భయం ఉటుంది. ప్రేక్షకులు ఎలా రీసివ్ చేసుకుంటారో అనే అనుమానం వుటుంది. వారి అనుమానం నూటికి నూరు పాళ్ళు కరెక్ట్. ప్రేక్షకుల కనెక్షన్ చాలా డిఫరెంట్ గా వుటుంది. ఇలాంటి ప్రయోగాలు చేసి బెడిసి కొడితేమామాత్రం పరిస్థితి దారుణంగా వుటుంది. జనరల్ గా హీరోగా ఇక అంతే సంగతులు అనుకున్న తరుణంలో ఇలా విలన్ రోల్స్ వైపు వస్తారనే ఓ అభిప్రాయం ఆడియన్స్ లో వుటుంది. ఇదే అభిప్రాయంతో మాత్రం కనెక్ట్ అయితే కష్టమే. రెండేళ్ళకు ముందు నాని పరిస్థితి చాలా బ్యాడ్ గా వుండేది. పైసా , జెండాపై కపిరాజు, ఆహా నా కల్యాణం.. ఇలా వరుసగా డిజాస్టర్లు చూశాడు నాని. ఈ దశలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం తో కాస్త తేరుకున్నాడు. భలే భలే మగాడివో తో పూర్తిగా ట్రాక్ ఎక్కేశాడు. ఇప్పుడు బండి సూపర్ ఫాస్ట్ లా నడుస్తుంది. మరి ఊపులో చక్రంలో విలనిజం అంటూ పుల్ల పెడితే ఏమౌతుందో నాని బాబే తెలుసుకోవాలి.