నాని అంటే సుందరానికి టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. యూనిట్ అంతా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. టీజర్ రిలిజే కాబట్టి ఎవరూ సినిమా గురించి ఎక్కువగా చెప్పలేదు. అందరూ ఫన్ గ్యారెంటీ అని మాట్లాడారు. అయితే హీరో నాని మాత్రం దర్శకుడు వివేక్ ఆత్రేయపై తనకున్న అభిమానం చాటుకున్నాడు.
”సినిమా గురించి చెప్పాల్సిన విషయాలు చాలా వున్నాయి. టీజర్ లాంచ్ కాబట్టి అప్పుడే సినిమా గురించి ఎక్కువ చెప్పను. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి మాత్రం ఒక మాట చెప్పాలి. కొన్ని సినిమాలు మరో దర్శకుడు తీస్తే ఎలా వుంటుంది ? అని ఊహించుకునే అవకాశం వుంటుంది. కానీ వివేక్ తీసిన సినిమా మాత్రం వివేక్ తప్పా ఎవరూ తీయలేరు. ఈ కథని వివేక్ చెప్పినట్లు ఎవరూ చెప్పలేరు. నాలో వుండే ప్రేక్షకుడు వివేక్ చేసే సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలని ఫిక్స్ అయిపోయాడు” అని చెప్పుకొచ్చాడు నాని. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.