న్న చిన్న కథలు చేసుకొంటూ, అందులోనే తన మార్క్ చూపించుకొంటూ, హీరోగా సేఫ్ ప్లేస్‌కి చేరిపోయాడు నాని. అతనుంటే చాలు సినిమా గట్టెక్కేస్తోంది అన్న నమ్మకం కలుగుతోంది సీనీ జనాలకు. దానికి తగ్గట్టు యావరేజ్ సినిమాల్ని కూడా హిట్ చేసిన దాఖలాలున్నాయి. జెంటిల్మెన్, నిన్నుకోరి, నేను లో్కల్ ఇవేం కొత్త కథలు కావు. అత్యద్భుతమైన కథనాలూ లేవు. కేవలం నాని ఇమేజ్‌పై నిలబడి ఆడేశాయి. నాని ఎంటర్టైన్మెంట్, అతని సహజ సిద్ధమైన నటన.. ఆయా సినిమాలకు విజయాల్ని అందించి పెట్టాయి. చిన్న కథకు నాని స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్ జోడిస్తే సినిమాలు ఆడేస్తాయన్న నమ్మకం జనాలకు కలిగింది. ఎంసీఏదీ అదే దారి. ఇదేం గొప్ప కథ కాదు. నానిని నమ్ముకొని తీసిన సినిమా.
కాకపోతే ఇలాంటి చోటే జాగ్రత్తగా ఉండాలి నాని. తనని నమ్ముకుని జనాలు థియేటర్లకు వస్తున్నారు. అన్ని సార్లూ.. ఒకటే ఫార్ములా వర్కవుట్ కాదు. నాని ఏ సీన్‌కి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడో, ఏ డైలాగ్ ఎలా పలుకుతాడో ప్రేక్షకులకు తెలిసిపోయింది. అందుకే ఎంసీఏలో తనదైన కామెడీ టైమింగ్ చూపించినా.. ప్రేక్షకులకు కొత్తగా అనిపించం లేదు. నానీ నటన కూడా క్రమంగా రొటీన్ దారిలో పడిపోతోందేమో అన్న ఫీలింగ్ కలుగుతోంది. తన స్టైల్ మార్చుకోమని చెప్పడం లేదు.. ఎంచుకొనే కథల్లో కాస్త జాగ్రత్త అవసరం అని గుర్తు చేస్తున్నామంతే. భలే భలే మగాడివోయ్ లాంటి వైవిధ్యభరితమైన కథల్ని ఎంచుకొంటే.. నానిలోని కొత్త కొత్త యాంగిల్స్ బయటకు వస్తుంటాయి. నాని ఓ పరిపూర్ణ నటుడు. ఏ ఎమోషన్ అయినా పండించేస్తాడు. మూస కథల కోసమో, మాస్ ఇమేజ్ కోసమో ఆలోచించకుండా వైవిధ్యభరితమైన కథల్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. నాని కాస్త జాగ్రత్త పడితే.. ఏంసీఏ లాంటి ఫలితాలకు దూరంగా, ప్రేక్షకుల నమ్మకాలకు దగ్గరగా ఉండొచ్చు.