పారితోషికం బదులుగా వాటా తీసుకోవడం ఈనాటి కథానాయకుల ట్రెండ్. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా వాటాకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నాని కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు. `జెర్సీ` సినిమాకి నాని పారితోషికం తీసుకోలేదు. వాటా మాత్రమే దక్కించుకున్నాడు. `జెర్సీ` సినిమా విడుదలై మంచి టాక్‌తో నడుస్తోంది. తొలి మూడు రోజుల్లోనూ దాదాపు 16 కోట్లు (షేర్) వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 26 కోట్ల బిజినెస్ జరుపుకొంది. లాంగ్ రన్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చు. శాటిలైట్‌తో కలుపుకుని దాదాపు 36 కోట్లు వసూలు అయినట్టు. అంటే.. 18 కోట్ల లాభం. అందులో మూడొంతులు తీసుకున్నా దాదాపుగా 6 కోట్లు పారితోషికం.
నాని రెమ్యునరేషన్ ఇప్పుడు 6 నుంచి 8 కోట్లు ఉంటోంది. అంటే.. తన టార్గెట్ రీచ్ అయినట్టే అనుకోవాలి. పైగా `రెమ్యునరేషన్ తీసుకోకుండా చేశాడు` అన్న మంచి పేరు కూడా మూటగట్టుకున్నాడు. నాని సినిమా అనేసరికి.. కనీసం 40 కోట్ల వ్యాపారం జరిగిపోతోంది. అది నానికి ఉన్న క్రేజ్. అందుకే నాని ధైర్యంగా పారితోషికం బదులుగా వాటా తీసుకోవడానికి రెడీ అయ్యాడు. కొన్ని మంచి కథలు వచ్చినప్పుడు, వాటి వెనుక నిలబడాలన్న తపన పెరిగినప్పుడు కథానాయకులు ఈ తరహా త్యాగాలు చేస్తే బాగానే ఉంటుంది. పైగా నాని త్యాగం పూర్తి క్లాలిక్లేటెడ్. ఇదేం ఆర్ట్ సినిమా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి టచ్ అయితే.. ఎక్కడో ఉంటుందని నానికి తెలుసు. అందుకే ఈ స్టెప్ తీసుకున్నాడు.