మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’తో సందీప్ కిషన్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరిపోయింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సందీప్‌కి.. ఇది మరో ఎదురుదెబ్బ. శుక్రవారం విడుదలైన ఈ సినిమా… తొలి షోకే `ఫ్లాప్` టాక్ మూటగట్టుకుంది. వసూళ్లూ దారుణంగా ఉన్నాయి. అయితే ఈ కథ ముందు మరో ముగ్గురు హీరోలకు వినిపించారు. నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండల దగ్గరకు ఈ స్క్రిప్టు వెళ్లింది. వాళ్లు కథ విని… ‘ఆలోచించుకుని చెబుతా’ అంటూ తెలివిగా కాలయాపన చేశారు. అర్జెంటుగా సినిమా తీయాలన్న మూడ్‌లో ఉన్న మంజుల.. తనకు అందుబాటులో ఉన్న సందీప్‌కిషన్‌తో ఈ స్క్రిప్టు పట్టాలెక్కించేసింది. అలా ఈ ఫ్లాప్‌ని ఓ ముగ్గురు హీరోలు తప్పించుకోగలిగారు. సందీప్ మాత్రం కథపై జడ్జిమెంట్లేకనో, లేదంటే జెమిని కిరణ్‌కి ‘నో’ చెప్పడం ఇష్టం లేకనో ఇరుక్కుపోవాల్సివచ్చింది.