బ్రహ్మోత్సవం ఫ్లాప్‌తో శ్రీకాంత్ అడ్డాల నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సివచ్చింది. మరో కథ రాసుకోవడానికే ఆయన చాలా టైమ్ తీసుకున్నారు. ఇప్పుడో స్క్రిప్టు సిద్ధం చేసుకుని కథానాయకుడి కోసం అన్వేషిస్తున్నారు. యువ కథానాయకుడు శర్వానంద్‌కి ఈ కథ వినిపించాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే… శర్వా తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. చేస్తాను.. చేయను – ఇలా ఏదీ చెప్పకుండా కాలయాపన చేస్తుండడంతో.. శ్రీకాంత్ ఈ కథ కోసం మరో హీరోని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈమధ్య నానిని కలిసిన శ్రీకాంత్ అడ్డాల.. శర్వా కోసం తాను రాసుకున్న కథని వినిపించినట్టు తెలుస్తోంది.
నానికి కథ నచ్చినా… ఇప్పుడైతే చేసే పరిస్థితులో లేడు. ‘జెర్సీ’ కి డేట్లు సర్దుబాటు చేసేశాడు. అది పూర్తయితే గానీ శ్రీకాంత్ సినిమాని ఓకే చేయలేడు. శర్వా కోసం ఎదురుచూసినట్టే, నాని కోసం కూడా శ్రీకాంత్ ఎదురుచూస్తాడా? లేదంటే మరో కథానాయకుడ్ని పట్టుకుంటాడా? అనేది తేలాల్సివుంది. హీరో ఎవరైనా సరే.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్సంస్థ నిర్మించనుంది. గీతా ఆర్ట్స్ పూనుకుంటే హీరోలకు కొదవ ఉండదు. కానీ… శ్రీకాంత్ విషయంలో వాళ్లూ చురుగ్గా స్పందించడం లేదని టాక్. `హీరోని నువ్వే వెదికి పట్టుకో..` అన్నట్టు ఆ బాధ్యత కూడా శ్రీకాంత్‌కే వదిలేశార్ట. మరి శ్రీకాంత్ రాసుకున్న కథకు తగిన హీరో ఎప్పుడు దొరుకుతాడో??